శ్రావణ మంగళవారముల లాగే శ్రావణ శుక్రవారములు కూడా చాలా ముఖ్యమైనవి, మహత్తరకర మైనవి కూడా.
మామూలుగా ప్రతీ శుక్రవారాన్ని మనం అనాదిగా లక్ష్మి దేవితో జత కూరుస్తుంటాము. శుక్రవారము లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంటుంది అని. ఆ రోజు అందుకే ప్రత్యేకంగా ఇల్లు, వాకిలీ శుభ్రపరుచుకుని కడుక్కుని, ముగ్గులేసుకుని, సాయంకాలం పెందరాళే దీపాలేసుకుని, వాకిలి తెరిచి ఉంచుతాము. శుభ్రత అంటే ఆ దేవికి చాలా ఇష్టము.
అందులోనూ శ్రావణ మాసం లో వచ్చే శుక్రవారాలన్నింటికీ కూడా ఇంకా ఎక్కువ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే శ్రావణ శుక్రవారాలంటే లక్ష్మీదేవికి గాని, ఏ దేవికైనా కాని చాలా చాలా ఇష్టమని మనము చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నదే. ఆ రోజుల్లో లక్ష్మీదేవిని శ్రద్ధతో పూజించిన వాళ్ళని ఆ దేవి కరుణించి వరాలనిస్తుంది, సకల సౌభాగ్యాలతో ముంచెత్తుతుంది.
వర లక్ష్మి అంటే వరాలని ఇచ్చే లక్ష్మీదేవి.
అలాగే వరులని ఇచ్చే లక్ష్మి కూడా.
కన్యలు ఈ వరలక్ష్మీ వ్రతము చేసుకుంటే వాళ్లకి మంచి భర్తలని ప్రసాదిస్తుంది ఆ దేవి. పెళ్లి అయిన గృహిణులు చేస్తే వారికి చిరకాలము పసుపు కుంకుమలు నిలబడునట్లుగాను, భర్తల ఇంకా పిల్లల అభివృద్ధి కలిగేట్లుగాను ఆ తల్లి ఆశీర్వదిస్తుంది.
వరలక్ష్మి పూజ నాడు శుచిగా తయారయ్యి ఆ దేవి పటము లేక విగ్రహమో పెట్టుకుని వాటిని అలంకరించి, పసుపు ముద్దతో ఒక చిన్న దేవి ఆకారము లాగ తయారు చేసుకుని పళ్లెం లోనో ఆకులోనో పెట్టి దీపం వెలిగించి, పువ్వులతోను పసుపు కుంకుమలతోను పూజించాలి. లక్ష్మి అష్టతోత్తర నామాలు కానీ, సహస్రనామాలు కానీ చదువుతూ ఆ పువ్వులూ పసుపు కుంకుమలూ జల్లుతూ పూజ చేయాలి. ఆ తరువాత పళ్ళు పాయసం లాంటివి ఆరగింపు పెట్టాలి . కర్పూరం వెలిగించి మంగళ హారతులు పాడి ఆమె ఆశీర్వాదాలు పొంది ప్రసాదం అందరికి పంచి, తామూ ఆరగించాలి. చుట్టూ పక్కల ముత్తైదువలనూ కన్యలనూ పిలిచి వాళ్లకి కూడా ప్రసాదంతో బాటు ఏదైనా బ్లౌజ్ పీస్, పండు, పసుపుకుంకం పంచుకుంటే చాలా మంచిది. అవి లక్ష్మీదేవికి సమర్పించినట్లే అవుతాయి. ఇలా సింపుల్ గా చేసుకోవచ్చును.
వరలక్ష్మి వ్రతం అదే రోజున ఒక వేళ చేసుకోలేక పోయినా ఆ తరువాతి మూడు శుక్రవారాలలో ఏ శుక్రవారమైనా చేసుకున్న పర్వాలేదు. కానీ పూర్తి భక్తి తోనూ నమ్మకంతోనూ చేసుకోవాలి. అప్పుడే సరైన ఫలితం దక్కుతుంది.
You can start with 24 names of Vishnu.
Thereafter recite the Lakshmi Puja Lyrics